ప్రొ. శేషయ్య
( ఎస్ కె యూనివర్సిటీ న్యాయ శాస్త్ర ఆచార్యుడు శేషయ్య ఫిబ్రవరి 1998లో రాసిన వ్యాసం ఇది . ఇందులోని వివరాలు కొంత పాత పడినప్పటికీ కరువు సమస్యను అర్థం చేసుకోడానికి పనికి వస్తుందని పునర్ముద్రిస్తున్నాం )
మనదేశంలో కొన్ని రాష్ట్రాలలోని ప్రజలు కరువుతో బాధపడుతూ వుంటే మిగతా రాష్ట్రాలలో వరదలతో, తుఫానులతో వున్న కొద్దిపాటి ఆస్తులను పోగొట్టుకొని అనాధలవుతున్నారు. కరువు తీవ్రంగా వున్నప్పుడు ప్రతిపక్షపార్టీలు కరువు నివారణ పనులు చేపట్టాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకవచ్చే సమయానికి వేరే ప్రాంతాల్లో వరదలు తుఫానులు వచ్చి వీరి డిమాండ్లు నీటిపాలవుతున్నాం. ప్రత్యేకించి మనరాష్ట్రంలో తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల్లో కరువు పనులు వెదలుపెడతారనే సమయానికి సర్కారు ప్రాంతాల్లో తుఫాను రావడం, రాష్ట్రప్రభుత్వ దృష్టి తుఫాను బాధితులను ఆదుకోవడంలో కేంద్రీకరించడం జరుగుతున్నది. తుఫాను వలన సంభవించే ప్రాణనష్టం, ఆస్తినష్టం, పంటనష్టం స్పష్టంగా కనబడి సమస్య భయంకరంగా కనబడుతుంది. దీర్ఘకాలికంగా దుర్భిక్షంతో బాధపడుతున్న ప్రాంతాల్లో నష్టాన్ని లెక్కకట్టడం కష్టం. అంతేకాకుండ కరువుతీవ్రమై, ఆకలిచావులు సంభవించినపుడే సమస్య అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చనిపోంంది ఆకలితోనా, రోగంతోనా అనే చర్చలతో సమస్య పక్కదారి పడుతుంది.
ప్రపంచంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు తిండిలేక ఆకలితో మాడుతున్నారు. మనం అప్పుడప్పుడు ‘కల్లోలిత ప్రాంతాల’ గురించి మాట్లాడతావ. ఆఫ్రికా ఖండంలో దాదాపు 30 దేశాలు అధికారికంగా ‘ఆకలిరాజ్యాలు’గా ప్రకటించబడ్డాం. అందులో వఖ్యంగా ఇథియోపియాలో కరువు గజ్జెకట్టి నాట్యం చేస్తున్నది. ప్రతిరోజు దాదాపు 100 మంది చనిపోతుంటారని నెతొలిన్ పునరావాస కేంద్రం డైరెక్టరు బ్రెత్ గిస్సిన్ చెబుతున్నాడు. ఇథియోపియాలోనే దాదాపు 100 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. అంతే చాలామంది ఇతర ప్రాంతాల నుండి అక్కడికి చేరుకోవాలని బయలుదేరి మార్గమధ్యంలోనే చనిపోతున్నారు. మనదేశంలో కూడ ఈ మధ్య ఆకలిచావుల గురించి వింటూ వున్నాం. దేశంలోని 16 రాష్ట్రాలలో 261 మిలియన్ల ప్రజలు కరువు గుప్పెట్లో వున్నారు. దాదాపు 42 మిలియన్ హెక్టార్లలో పంట మాడిపోంంది. తాగేనీరు కూడా కరువై, రైళ్ళద్వారా మద్రాసుకు నీటిని సరఫరా చేశారు. వేలాది మంది ప్రజలు, పశువులు రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలను విడిచి వలసపోయారు. దాదాపు 17000 గ్రామాలు మహారాష్ట్రలో నీటి ఎద్దడికి గురైనాయని లెక్కలు చెబుతున్నాం. మన రాష్ట్రంలో 19 జిల్లాలు కరువువాతపడ్డాం. మహబూబ్‌నగర్, అనంతపురం జిల్లాలలో ఆకలిచావులు సంభవించాం. అనంతపురం జిల్లాలో గత 33 సంవత్సరాలలో 17 సంవత్సరాలు అనావృష్టి సంవత్సరాలు, ఈ ప్రాంతం క్రమక్రమంగా ఎడారిగా మారుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఎండిపోంన పొలాలను చూస్తూ గుండె పగిలి ఆకాశంవైపు ఆశగా చూస్తున్న రైతాంగంపై దేవుడు కరుణించలేదు. బిగుసుకపోంన వానదేవుడ్ని శాంతపరచడానికి కప్పల పెళ్ళిళ్ళు, జంతుబలులు, రాత్రిపూట స్త్రీలు నగ్నంగా ఊరి పొలిమేర చుట్టూ తిరగడం ` అంనా వర్షం పడలేదు. ప్రకృతి శాపంగానో, దేవుడి కోపంగానో ఈ పరిస్థితి వచ్చిందను కుందామా? వర్షాభావం వలన, ఆహారపదార్థాల కొరత వలన, జనాభా పెరుగుదల వలన కరువు పరిస్థితి ఏర్పడిరదని సరిపెట్టుకుందామా?
మానవుడు తన భౌతికావసరాలను ఉత్పత్తి చేసుకొనే క్రమంలో ప్రకృతితో పోరాటం చేయక తప్పలేదు. ఆ పోరాటంలో ప్రకృతిని పూర్తిగా తన అధీనంలోనికి తెచ్చుకోలేక పోంనప్పటికీ చాలా విషయాల్లో తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే శాస్త్రీయ విజ్ఞానం అభివృద్ధి చెందింది. ఈరోజు మేఘాలను మళ్ళించి కావలసినచోట, అవసరమైనప్పుడు వర్షాన్ని కురిపించగలుగుతున్నాడు. నదులపైన ఆనకట్టలను కట్టి నీటిపారుదల సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాడు. కృత్రిమ వంగడాలను కనిపెట్టి వ్యవసాయంలో యంత్రాలద్వారా అధిక దిగుబడులను సాధించగలుగుతున్నాడు. వర్షాలవలన లభ్యమైన నీటిని నిల్వచేసుకోవడంలో, నీరు ఆవిరికాకుండా అరికట్టడంలో, ‘పాతాళగంగ’ నుండి నీటిని వెలికితీయడంలో కావలసిన శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానాన్ని సంపాదించాడు. అంతే సమస్య అంతా ఈ జ్ఞానాన్ని ఎవరికోసం, ఎందుకోసం, ఎలా ఉపయోగించాలన్నదే. భారతదేశంలోని నీటి వనరులు ఇతర దేశాలతో పోల్చితే ఎక్కువగానే వున్నవి. సగటున 50 అంగుళాల వర్షపాతం కలిగి 400 మిలియన్ల హెక్టారుల నీరు నిలువవుతుంది. అందులో 70 మిలియన్ హెక్టారుల నీరు వాతావరణానికి ఆవిరి అంపోతున్నది. 115 మిలియన్ హెక్టారుల నీరు ఉపరితలంలో నిల్వ వుంటున్నది. మిగిలిన 215 మిలియన్ హెక్టారుల నీరు భూమిలోకి ఇంకిపోతున్నది. ప్రధానమైన నీటి వనరులు నదులు. దేశంలోని వెత్తం నదుల్లో నీటి ప్రవాహం 180 మిలియన్ హెక్టారులు. ఆ ప్రవాహంలో దాదాపు 70 మిలియన్ హెక్టారుల నీటిని వ్యవసాయానికి ఉపయోగించు కోవచ్చును. ఇప్పటి వరకు భూగర్భజలాలను 10 శాతం మాత్రమే వినియోగించు కుంటున్నాం. 131.1 మిలియన్ హెక్టారుల నీటిని 57.2 మిలియన్ హెక్టారుల భూమిలో పంటలు పండిరచడానికి ఉపయోగించుకోవచ్చునని, ప్రపంచంలోని భూగర్భ జలనిధుల్లో ఇండో`గంగా బేసిన్ అత్యధిక భూగర్భ జలాలను కల్గివుందని నిపుణుల అంచనా. ఇరిగేషన్ కమీషన్ అంచనా ప్రకారం క్రీ.శ.2000 సంవత్సరాల నాటికి ఒక హెక్టారు నీటిని కూడా వృథాకాకుండా వాడుకోవాలని ప్రకటించింది. ప్రస్తుతం లభ్యమయ్యే నీరు సాగుకు వీలైన భూవలకు సరిపోతుంది. అంతేకాక నీటిపారుదల సౌకర్యాలను అభివృద్ధిచేయడం ద్వారా మిగతా భూమిని సాగులోకి తెచ్చే అవకాశం వుంది. అంతే ప్రారంభమైన ప్రాజెక్టులు ఒక్కటికూడా పూర్తికాలేదు. దాదాపు 58 ప్రాజెక్టులు పూర్తికావడానికి చాలా దూరంలో వున్నాం. కొన్నింటి విషయంలో వాటి వ్యయం దాదాపు 500 శాతం అధికమైంది. సహారా ఎడారిని సహితం సస్యశ్యామలంగా మార్చగల విజ్ఞానం వున్నప్పుడు ప్రాథమిక అవసరమైన నీటిపారుదల సౌకర్యాలకు ప్రావఖ్యత ఇవ్వకుండా, పాలకవర్గాలు బడ్డెట్‌లో 1/4 వంతును ఆjధాల ఉత్పత్తికి ఖర్చుచేయడం. కరువుకు కారణం అనావృష్టి, ప్రకృతి వైపరీత్యం, జనాభా పెరుగుదల అని ప్రజలను మభ్యపెట్టడం నేరం కాదా?
అనావృష్టి వలన పంటలు నాశనమై ఆహారపదార్థాల ఉత్పత్తి తగ్గిపోతుందని, దానికి తోడు జనాభా పెరుగుదలవలన కరువు పరిస్థితి ఏర్పడుతుందని అనడానికి వీలులేదు. దేశం వెత్తంమీద ఆహారపదార్థాల ఉత్పత్తి పెరిగిందని ఈ విషయంలో స్వయంసమృద్ధి సాధించామని పంచవర్ష ప్రణాళికల కోసం తయారుచేసిన లెక్కలు, ప్రభుత్వ అధికారుల ప్రకటనలు వింటుంటావ. ఆహార పదార్థాల కొరత కరువు ఏర్పడడానికి కారణం కాదు. ఆహారం సంపాదించుకోవడంలో దేశంలోని ప్రజల ఆర్థిక పరిస్థితి అంటే ఆస్తి సంబంధాలపైన ఆధారపడివుంటుంది. ఇంకో విధంగా ప్రజల కొనుగోలు శక్తిమీద ఆధారపడివుంటుంది. వస్తువుల మారకపు విలువల మీద ఆధారపడి వుంటుంది. ఈ విషయం బెంగాల్ కరువును పరిశీలిస్తే తెలుస్తుంది. బెంగాల్ కరువును వూడు దశలుగా చెప్పుకోవచ్చు. వెదటిది 1942 నుండి మార్చి 1943Ñ రెండవ దశ మార్చి 1943 నుండి నవంబర్ 1943 మూడవ దశ నవంబర్ 1943 నుండి 1944 వరకు. ఈ దశలో కరువు తీవ్రస్థాంని చేరుకుంది. ఫామిన్ కమీషన్ 1.5 మిలియన్ల ప్రజలు చనిపోయి ఉంటారని కమీషన్ సభ్యుడు తర్వాత వెల్లడిరచాడు. అంతే ఆహార పదార్థాల సరఫరా విషయం చూస్తే 1942, 1943లో 1941వ సంవత్సరంకంటే ఆహారపదార్థాల ఉత్పత్తి 13 శాతం ఎక్కువ. 1943లో తలసరి మనిషికి ఆహార సరఫరా 9 శాతం ఎక్కువగా వుంది. ఈ కాలంలో జనాభా పెరుగుదల 1 నుండి 2 శాతం కంటే మించలేదు. ఆహార పదార్థాల ఉత్పత్తి ఎక్కువగా ఉండి, ఆకలి చావులకు గురైనారంటే వారికి ఆహార పదార్థాలు అందుబాటులో లేకనే చనిపోయారు. వారి కొనుగోలుశక్తి తగ్గిపోం బతకడానికి అవసరమైన ఆహారాన్ని సంపాదించుకోలేక ఆకలితో చనిపోయారు. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో ఉత్పత్తి అంన సంపద ఉత్పత్తిసాధనాలు ఎవరిచేతిలో ఉన్నాయో వారికే చెందుతుంది. శ్రమశక్తి తప్ప ఏ ఆస్తిలేని కార్మికుడు, వ్యవసాయ కూలీ తిండికిలేక మాడిపోతారు. కరువుకాలంలో నిత్యావసర వస్తువులను బ్లాక్ మార్కెట్ చేసి ధరలు విపరీతంగా పెంచడంవలన సామాన్యుని కొనుగోలుశక్తి తగ్గిపోతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1985`86 సంవత్సరాలలో ప్రభుత్వం దగ్గర ఆహారపదార్థాల నిల్వ 29.17 మిలియన్ల టన్నులు వుంది. ఈ నిల్వ దేశ స్వయంసమృద్ధికి తార్కాణం అని ప్రభుత్వం ప్రకటించింది. ఆహార పదార్థాల నిల్వలు ఒకపక్క, 40 శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువగా (దగ్గరగా) మరోపక్క వున్నప్పుడు వర్షాభావం, పంటనష్టం, జనాభా పెరుగదల కరువుకు కారణమని చెప్పడం ఎంతవరకు సహేతుకం? సహజ నైసర్గిక పరిస్థితులవలన దీర్ఘకాలికంగా కొనసాగుతున్న కరువును గురించి ఏ దశలోనూ ప్రభుత్వం ఏమీ చేయలేక పోవడం, వర్షంవల్ల లభ్యమవుతున్న నీటి వనరులను సరిగా ఉపయోగించుకోకుండా, నీటి పారుదల సౌకర్యాలను అభివృద్ధిచేయకపోవడం వఖ్యకారణం. వర్షం సవ్యంగా పడని సంవత్సరం అదేదో ప్రకృతి వైపరీత్యంగా కనబడుతోంది తప్ప, పరిపాలకుల నిర్లక్ష్యంగా కాదు.
పెట్టుబడిదారుల మధ్య పోటీ, లాభం కోసం ఉత్పత్తి, ఆర్థిక సంక్షోభం, అసమాన పంపిణీ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, దారిద్య్రం, కరువు, ఆకలిచావులు పెట్టుబడిదారీ విధానంలో అనివార్యం, అంతేకాక, పారిశ్రామిక రంగానికి, వ్యవసాయ రంగానికి సమన్వయం లేనప్పుడు వ్యవసాంక దేశాల్లో వూడు వంతుల జనాభా కరువుకు గురికావలసిందే. అంతే వివిధ వర్గాల ప్రజలపై కరువు ప్రభావంలో తేడాలుంటాం. మనదేశంలో వ్యవసాయ కూలీల, చిన్నకారు రైతులపై దీని ప్రభావం ఎక్కువగా వుంటుంది. గ్రామాలనుండి పట్టణాలకు వలస వెళ్ళటం, అక్కడ పనిదొరకక పస్తులతో గడపాల్సి వస్తుంది. వలస వెళ్ళలేని వాళ్ళు గ్రామాల్లో ఆకలి రాక్షసికి ఆహుతి కావలసివస్తుంది. ఈ పరిస్థితులు వూడవ ప్రపంచ దేశాల్లో తీవ్రంగా వుంటాం. చైనాదేశంలో విప్లవానికి వందు కరువుకాటకాలతో, వరదలలో బాధపడిన ప్రజలు విప్లవానంతరం ఈ సమస్యలను అధిగమించగల్గారు. జనాభా విషయంలో ప్రపంచంలోని అన్ని దేశాలకంటే ఎక్కువగా వున్నప్పటికీి దేశంలో ఉత్పత్తి అంన ఆహారపదార్థాలను, నిత్యావసర వస్తువులను సమానంగా పంపిణీచేయడంద్వారా, శ్రమకు తగిన ఫలితాన్ని శ్రామికులు పొందడం ద్వారా ప్రజల ప్రాథమిక అవసరాలకు లోటు లేకుండా పోంంది. అంతే వెనుకబడిన దేశాల ఆర్థిక విధానాలు, సామ్రాజ్యవాద దేశాల ప్రయోజనాల కనుకూలంగా అమలు పరచడం ద్వారా ఈ దేశాల్లో పేదరికం, ఆకలి పెరుగుతాయే తప్ప రూపుమాపబడవు.
బూర్జువా ఆర్థిక శాస్త్రవేత్తలు పేదరికం, నిరుద్యోగం, దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవడం, ఆదేశ ప్రజల వెనుకబాటుతనం, అనాగరికత, సోమరితనం, అసమర్థత వలన ఉత్పత్తిరేటు తక్కువగా వుంటుందని చెప్తారు. సామ్రాజ్యవాదుల పాలనవలన వలసదేశాల ప్రజలు తమ ఉన్నతమైన విలువలను, సంస్కృతిని సంతరించుకొని సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించుకుంటారని, ంప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఈ పరిణామక్రమంలో వచ్చినవేనని వాదిస్తారు. బ్రిటిష్‌వారు మనదేశానికి రాకవందు ప్రజలు వూఢనమ్మకాలతో, చాందస భావాలతో వున్నారని, వారి పరిపాలనా కాలంలో వీటిని రూపుమాపి ప్రజలను బాగుచేయాల్సిన బాధ్యత తమపై పడిరదని, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన ఎలా చేయాలో 200 ఏళ్ళలో నేర్పించామని చెప్పుకుంటారు. తర్వాత స్వాతంత్య్రం ‘ప్రసాదించి’ వాళ్ళ కాళ్ళమీద వారు నిలబడి అభివృద్ధిచెందడానికి అవకాశం కల్పించామని ఈ ఆర్థిక శాస్త్రవేత్తల పరిశీలనా సారాంశం. వెనుకబడిన దేశాలు అభివృద్ధి సాధించాలంటే ప్రణాళికల ద్వారా పారిశ్రామిక విధానాలను రూపొందించుకొని వందుకు సాగాలంటారు. జాతీయ తలసరి ఆదాయం శ్రామికుని ఉత్పాదకశక్తిమీద, శ్రామికుని జీవన ప్రమాణం అతని ఆదాయంమీద ఆధారపడి వుంటుందని చెప్తారు. ఈ సిద్ధాంతాల సారాంశంలో సామ్రాజ్యవాదులు తమ దోపిడీని కొనసాగించడానికి, మరుగుపరచడానికి మార్క్సిజానికి వ్యతిరేకంగా సృష్టించబడినవే. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సామ్రాజ్యవాదం దెబ్బతిని గుణపాఠాలు తీసుకొని కొత్తపద్ధతుల్లో, రూపాల్లో ఇది వరకు వలస దేశాలను దోపిడీచేయడం, నామమాత్రంగా స్వాతంత్య్రం పొందిన దేశాల్లోని రాజకీయ, ఆర్థికవిధానాలను తమ ప్రయోజనాల కనుగుణంగా మార్చుకోవడం జరిగింది. స్వాతంత్య్రం ప్రసాదించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వారి పెట్టుబడిని పదిలంగ కాపాడుకోడానికి, విచ్చలవిడిగా ప్రవేశపెట్టడానికి కావలసిన నిర్మాణరూపాలను ఈ దశల్లో సాధించుకున్నాం.
మూడో ప్రపంచదేశాల్లోని ఆర్థికవిధానాన్ని, పారిశ్రామికరంగాన్ని వ్యవసాంక రంగాన్ని సామ్రాజ్యవాద దేశాలు తమ దోపిడీ కనుగుణంగా మార్చుకొని, రాజకీయ, ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో పట్టును సాధించుకొని ఈ దేశాలన్నీ ప్రతి విషయానికి వాటిపై ఆధారపడే స్థితికి నెట్టబడతాం. ప్రతి దేశం స్వతంత్రమైందని, సార్వభౌమాధికారం కలవని చిన్నా పెద్ద దేశాలని తేడాలేకుండా సమానమని ఐక్యరాజ్య సమితి ఏర్పడిరది. దీనికి అనుబంధంగా అనేక సంస్థలు ఏర్పడినాం. అభివృద్ధి సాధించిన దేశాలు వెనుకబడిన దేశాలకు సహాయ సహకారాలు అందజేయాలనికూడా ఐ.రా.స. చెబుతుంది. అంతర్జాతీయ ప్రభుత్వ ఏజెన్సీలంన అంతర్జాతీయ కార్మిక సంస్థ , అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ , అంతర్జాతీయ ఆర్థిక సాంఘిక సాంస్కృతిక సంస్థ , ప్రపంచ బ్యాంకు , అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వెదలైన సంస్థలన్నీ సామ్రాజ్యావాద దేశాల కనుగుణంగానే పనిచేస్తున్నాం. అంతర్జాతీయ పెట్టుబడిదారీ గుత్త సంస్థలు వీటికి మధ్య సంబంధాలు ఏర్పరచుకొని ఇతర దేశాల్లోని ఆర్థిక విధానాల్లో చొరబడతాం. పెట్టుబడిని ప్రవేశపెట్టి లాభాలను గడిస్తాం. ఈ అంతర్జాతీయ సంస్థలు మనదేశ ఆర్థిక విధానాలను, పంచవర్ష ప్రణాళికలను తయారు చేయడంలో కీలకైన పాత్ర వహిస్తాం. మనదేశంలో వ్యవసాయరంగంలో ‘హరితవిప్లవం’ పేరుతో సామ్రాజ్యవాదం ఎలా చొచ్చుకపోంందో గమనిస్తే ఈ విషయం బోధపడుతుంది. వ్యవసాయరంగంలో అధిక ఉత్పత్తి సాధించడానికి రసాయనిక ఎరువులను, తెగుళ్ళ నివారణకు అవసరమైన మందులను వాడటం హరితవిప్లవం తర్వాత ఎక్కువైంది. ఈ రోజు రైతు ఈ రసాయన ఎరువులు లేకుండా వ్యవసాయం చేసే పరిస్థితిలో లేడు. ఎరువుల కర్మాగారాలు, మందుల ఫ్యాక్టరీలు చాలావరకు సామ్రాజ్యవాద దేశాల పెట్టుబడితో మనదేశ పెట్టుబడిదారులు కలిసి స్థాపించారు. వీటిని ఉత్పత్తిచేయడానికి అవసరమైన శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానానికి ఆ దేశాలపై ఆధారపడాల్సి వుంటుంది. ఈ మందుల వాడకంతో పంటలకు తెలియని తెగుళ్ళు అంటుకున్నాం. వాటిని నివారించడానికి మళ్ళీ రసాయనిక మందులపై ఆధారపడాల్సి వచ్చింది. హరితవిప్లవం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెరిగినప్పటికీ దాని ఫలితం పండిరచిన రైతుకు గాక మార్కెట్టులో దళారులకు, వ్యాపారస్తులకు మాత్రమే చెందింది. వెనుకబడిన దేశాల్లోని ప్రజానీకం సామ్రాజ్యవాద దేశాల్లోని ధనవంతులకు దేశంలోని సంపన్నవర్గాలకు తిండిగింజలను ఉత్పత్తిచేసి తావ పస్తులతో గడపాల్సి వస్తుంది. మనదేశం వెత్తం ఎగుమతుల్లో ఆహారపదార్థాల ఎగుమతి నాలుగోవంతు. ఎక్కువ భాగం సామ్రాజ్యవాద దేశాలకు తక్కువ ధరకు ఎగుమతి చేస్తున్నావ. సామ్రాజ్యవాద దేశాలు తమ ఆర్థికవిధానాన్ని ఆjధాల ఉత్పత్తిపై కేంద్రీకరించి అవసరమైన తిండిగింజలను దిగుమతి చేసుకుంటున్నాం. వ్యవసాయం నూతన పద్ధతుల పేరుతో సామ్రాజ్యవాదం ఈ రంగాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. హరితవిప్లవం ద్వారా తిండికి అవసరమైన ఆహారపంటలను కాకుండ వాణిజ్య పంటలకే ప్రాధాన్యత ంస్తారు.
సామ్రాజ్యవాద దేశాలు వెనుకబడిన దేశాల్లోని పారిశ్రామిక, వ్యావసాంక రంగాల్లో పనిచేసే శ్రామికుల శ్రమశక్తిని దోపిడీచేయడమే కాక వారి జీవితాలతో చెలగాటమాడతారు. ఉదాహరణకు భోపాల్ అంతర్జాతీయ కార్పొరేషన్ యూనియన్ కార్బైడ్ అనుబంధ సంస్థ నుండి విషవాjవు వెలువడి 2500 మందికి పైగా చనిపోయారు. ఈ సంస్థ వఖ్యంగా తెగుళ్ళ మందులో వాడే రసాయన పదార్థాలను తయారుచేస్తుంది. ఎవరెడీ బ్యాటరీలను అమ్మడానికి ప్రవేశించిన సంస్థ ఈనాడు 8 రాష్ట్రాలలో 15 ప్లాంటులను ఏర్పాటుచేసింది. ఈ సంస్థ వ్యాపారంలో ప్రపంచంలో 8వ స్థానం, అమెరికాలో 3వ స్థానం సంపాదించింది. ఇటువంటి సంస్థలు మన భారతదేశంలో ఎరువుల కర్మాగారాలలో, తెగుళ్ళ మందుల తయారీలో, ఫార్మసీ కంపెనీలలో అత్యధిక వాటాలను కలిగి లాభాలను సంపాదిస్తున్నాం. ఉత్పత్తి లాభం కోసం అంనప్పుడు ఉత్పత్తి క్రమం పరిసరాలపై చూపే ప్రభావాన్ని పెట్టుబడిదారులు పట్టించుకోరు. పారిశ్రామికీకరణ ద్వారా పరిసరాలు, వాతావరణం కాలుష్యంతో నిండిపోం తెలియని రోగాలతో ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. కాలుష్య నివారణకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా, పథకాలు రూపొందించినా పెట్టుబడిదారులు వాటిని ఉల్లంఘించడం, చట్టాలను అమలుచేయవలసిన అధికారులను డబ్బుతో కొనివేయడం జరుగుతున్నది.
ప్రకృతి వనరులను విచ్చలవిడిగా దోపిడీచేస్తూ, పరిసరాలను కాలుష్యంతో నింపి వాతావరణంలో సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఉదాహరణకి అడవి సంపదను కాపాడటానికి ఫారెస్టు చట్టాలను తీసుకవచ్చారు. ఈ అడవి సంరక్షణ చట్టం 1980లో అమల్లోకి వచ్చింది. అంతకువందు ప్రతి ఏటా లక్షన్నర హెక్టార్ల అడవి అంతరించి పోతున్నదని ఈ చట్టం వచ్చిన తర్వాత ఏటా 16 వేల హెక్టార్ల అడవి నాశనమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు గిరిజనులు అడవిని నరుకుతున్నారని తద్వారా టేకు వ్యాపారం ప్రభుత్వమద్దతుతో ఎలా జరుగుతున్నదో ఇటీవల శ్రీనివాసులురెడ్డిని మంత్రి పదవి నుండి తొలగించిన తర్వాత గోదావరి ప్లంవుడ్ కంపెనీ ఉదంతం తెలియజేస్తున్నది. అడవి సంపదను ఎక్కువగా పారిశ్రామిక రంగానికి పెట్టుబడిదారులు ఉపయోగించు కుంటున్నారు. శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానంతో పెట్టుబడిదారులు ప్రకృతి వనరులను తమ లాభాలకోసం దోపిడీచేస్తూ నీటిని, గాలిని కాలుష్యంతో నింపి భూమిని నిస్సారంగా మారుస్తున్నారు. ప్రపంచ జనాభాలో 6 శాతం వున్న అమెరికా ప్రపంచంలో 40 శాతం పరిసర కాలుష్యానికి కారణం అని, గత 50 ఏళ్ళలో కాలుష్యం వలన 40 జంతు, పక్షి జాతులు నశించిపోయాయని 660 జాతులకు అపాయం ఏర్పడిరదని నిపుణుల అంచనా. సామ్రాజ్యవాదులు, ప్రైవేటు పెట్టుబడిదారులు సృష్టించిన సమస్యలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. అదికూడ ప్రజలు సమస్యా నివారణకు ఉద్యమం నడిపినప్పుడే.
కరువు పీడిత ప్రాంతాల్లో మనుషులు తుఫానులో, వరదల్లో లేదా యాక్సిడెంట్‌లో మరణించినట్లుగాక పౌష్ఠికాహార లోపంవల్ల క్రమక్రమంగా క్షీణించి చనిపోతారు. ఒక్కొక్క ప్రాంతంలోని పరిస్థితులనుబట్టి, కరువు తీవ్రతనుబట్టి ఆకలిచావులు సంభవిస్తాం. బెంగాల్ కరువును పరిశీలిస్తే 1943 డిశంబరు ప్రాంతంలో కరువు తీవ్రస్థాంని చేరుకుంది. ఈ దశలోనే ఆకలిచావులు ఎక్కువయ్యాం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గత వూడు సంవత్సరాలకంటె ఆ సంవత్సరవలోనే ఆహారపదార్థాల దిగుబడి ఎక్కువగా ఉంది. అంతే పేదప్రజలు మాత్రం తిండిలేక పస్తులతో గడిపే దశనుండి ఆకలిచావుల దశకు చేరుకున్నారు. బెంగాల్ కరువులో మరణించినవారు చాలావరకు ఆకలితో చనిపోయారని ఇదేకాలంలో కలరా, మలేరియా వ్యాధులు వ్యాపించి ఎక్కువమంది మరణించారని ఫామిన్ కమీషన్ నివేదిక తెలిపింది. ఆకలి చావులు పరిశీలించిన తర్వాత ఎక్కువమంది విరోచనాలతో చనిపోయారని పేర్కొన్నారు. విరోచనాలు, దీనికి సంబంధించిన రోగాలు తినడానికి పనికిరానివి తినడం వలన వస్తాం. గత రెండేళ్ళలో అనంతపురం, మహబుబ్‌నగర్ జిల్లాలలో సంభవించిన ఆకలిచావుల గురించి అసెంబ్లీలో చర్చకు వస్తే చనిపోంది ఆకలితోకాదని, అలా జరగడానికి వీలులేదని, ఎందుకంటే ప్రభుత్వం కిలో బియ్యం 2 రూపాయలకే సరఫరా చేస్తున్నదని, చనిపోంన వాళ్ళు రోగంతోను, కొడుకులు తిండి పెట్టనందువలన, ముసలితనం వ లన చనిపోయారని ప్రభుత్వం సమాధానం చెప్పింది.
వెనుకబడిన దేశాలు వివిధ ప్రణాళికల ద్వారా, సామ్రాజ్యవాద దేశాల ఆర్థిక సహాయంతో అభివృద్ధి సాధించినా దాంతోపాటు పేదరికం కూడా పెరుగుతుంది. పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత ంచ్చామని పంచవర్ష ప్రణాళికల్లో పేర్కొంటారు. ప్రస్తుతం ‘కనీస అవసరాల కార్యక్రమం’ అంతర్జాతీయ సంస్థలు తయారుచేసిన పథకం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నామని ప్రచారం చేస్తుంది. వీటిని అమలు చేయడానికి సామ్రాజ్యవాద దేశాలనుండి ఆర్థిక సహాయాన్ని కోరుతుంది. అంతే వాస్తవంలో ఈ కార్యక్రమాలవలన లాభపడేది రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు. కరువు నివారణ పథకాలు అమలుచేసినట్లు రికార్డులలో మాత్రమే వుంటుంది. ఈనాడు దోపిడీ ప్రభుత్వాలు, పాలకవర్గాలు మతాన్ని కులాన్నే కాకుండ కరువును, ఆకలిచావులను, సతీసహగమనాన్ని తమ ఓట్ల రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఈ మధ్య కరువు సమస్య ప్రతిపక్షపార్టీలకు, కాంగ్రెసేతర ప్రభుత్వాలకు కేంద్రాన్ని విమర్శించడానికి ఆధారంగా మారింది. నీటి సమస్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల సమస్యగా, రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య తగాదాగా మారుస్తున్నారు. ప్రసుత్తం కేంద్ర ప్రభుత్వం రాజీవ్ నాయకత్వంలో కరువుకు వ్యతిరేకంగా పోరాటం వెదలుపెట్టింది. కరువు నివారణ కార్యక్రమాలు సరిగా అమలుచేయలేదని రాష్ట్రాలను విమర్శిస్తున్నాడు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే ఈనాడు దేశంలోని 261 మిలియన్లకు పైగా ప్రజలు కరువుతో బాధపడుతున్నారు. ఆకలిచావులు ఎక్కువవుతున్నాం. కరువు ఇంతకు వనుపటిలాగా ఐదేళ్ళకో, రెండేళ్ళకో కాకుండా నిత్యజీవిత సమస్యగా తయారవుతున్నది. దీర్ఘకాలిక కరువు వుండటం, వర్షపాతం తక్కువ కావడం వలన కాదు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రమే.
కాబట్టి కరువు మానవుల సృష్టి అనడం కంటే పెట్టుబడిదారీవర్గం లాభాల వేటలో సృష్టిస్తున్న సమస్య అనడం సమంజసం. ఇది పెట్టుబడిదారుల దోపిడీ ఫలితం. సామ్రాజ్యవాదులు వూడవ ప్రపంచదేశాల్లోని పెట్టుబడిదారులతో, పాలకవర్గాలతో కలిసి ‘అభివృద్ధి’ పేరిట కొనసాగిస్తున్న దోపిడీ విధానం. పేదరికం, కరువు మనిషిని తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేస్తాం. ఇది మానసిక హింస. వ్యవస్థ నిర్మాణంలో అంతర్గతంగా, నిశ్శబ్దంగా అమలవుతున్న హింస . ప్రజలు అసంతృప్తితో వ్యవస్థపై తిరుగుబాటు చేసినపుడు ప్రభుత్వాల ప్రత్యక్ష హింస దీనికి తోడవుతుంది.