చరిత్ర

[మార్చు]

రాయలసీమ విజయనగర సామ్రాజ్యంలో భాగంగా శ్రీ కృష్ణదేవ రాయలచే పరిపాలించబడింది. ఇంకా కాకతీయ, ముసునూరి వారసులైన పెమ్మసాని, రావెళ్ళ, మిక్కిలినేని, సాయపనేని కమ్మనాయక రాజులు రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించారు. అది వరకూ తూర్పు చాళుక్యుల పరిపాలనా కేంద్రంగా హిరణ్యక రాష్ట్రంగా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై చోళుల ప్రభావం పెరిగింది. బ్రిటిషు వారి సహకారాన్ని పలు యుద్ధాలలో పొందిన హైదరాబాదుకి చెందిన నిజాం సుల్తానులు 1802 లో ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దీనికి దత్త మండలం అని పేరు వచ్చింది. 1808 లో దత్త మండలం ను విభజించి బళ్ళారికడప జిల్లాలని ఏర్పరచారు. 1882 లో అనంతపురంను బళ్ళారి నుండి వేరు చేశారు. ఈ ప్రాంతానికి 1928లో చిలుకూరి నారాయణరావు “రాయలసీమ” అని పేరుపెట్టాడు. అప్పటినుండి ఆ పేరే స్థిరపడినది.

ప్రాథమికంగా తెలుగు మాట్లాడే ఈ జిల్లాలు 1953 వరకూ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నాయి. బళ్ళారి కూడా రాయలసీమలో ప్రాంతంగానే ఉండేది. కోస్తా, రాయలసీమ నాయకులు జరిపిన అనేక సంవత్సరాల ఉద్యమం ఫలితంగా 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు ఈ నాలుగు జిల్లాలను ఆంధ్ర రాష్ట్రం లో, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దృష్ట్యా బళ్ళారిని కర్ణాటకలో కలిపి వేశారు. కన్నడతెలుగు మాట్లాడేవారు సమానంగా ఉన్న బళ్ళారి నగరాన్ని పలు చర్చలు, వివాదాల తర్వాత మైసూరులో చేర్చారు. 1956 లో ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణలో కలపటంతో అప్పటి నుండి ఇవి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉంటున్నాయి. తెలంగాణా విడిపోయిన తర్వాత ఈ ప్రాంతం నవ్యాంధ్రప్రదేశ్ లో భాగమైంది.

తెలుగు మాట్లాడే ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ వైశాల్యంలో చిన్నదైననూ తెలుగుతమిళంకన్నడఉర్దూ కళల్లో, సంస్కృతుల్లో, సాహిత్యంలో ఈ ప్రాంతం యొక్క ప్రభావం బహు అధికం.

కోస్తా ప్రాంతంతో పోలిస్తే రాయలసీమ అభివృద్ధి పరంగా వెనుకబడి ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినపుడు రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలోని కర్నూలును కొత్త రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారు. అయితే మరో మూడేళ్ళలోనే విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో రాజధాని హైదరాబాదుకు మారింది.

వ్యుత్పత్తి

[మార్చు]

పలు యుద్ధాలలో బ్రిటీషు వారు నిజాం పాలకులకి సహకరించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దత్త మండలాలు లేదా దత్త సీమ పదాలు వ్యావహారికంలోకి వచ్చాయి. 20వ శతాబ్దపు ప్రారంభం నాటికి ఇక్కడి మేధావులు ఈ పేర్లు అవమాన కారకాలుగా అనుభూతి చెందారు. 1928 నవంబరు 17-18 తారీఖులలో నంద్యాల పట్టణంలో జరిగిన ఆంధ్ర మహాసభలో పాల్గొన్న నాయకుల మధ్య జరిగిన తీవ్రమైన చర్చలలో చిలుకూరి నారాయణ రావు విజయనగర సామ్రాజ్యమునకు చెందిన రాయల వంశము ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కావున, వారి సుపరిపాలనలోనే ఇక్కడి సంస్కృతి, వారసత్వ సంపదలు ఒక వెలుగు వెలిగాయి కావున, దీనికి రాయలసీమ అని పేరు పెట్టాలని ప్రతిపాదించారు. (ఇది వరకు ఈ పేరు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ప్రతిపాదించారు అనే ఆలోచన వ్యాప్తిలో ఉండేది. కానీ పరిశోధనల్లో ఈ ఘనత చిలుకూరి వారిదే అని తేలినది.) రాయలసీమ అన్న పేరు అన్ని వర్గాల మేధావులని/సామాన్య ప్రజానీకాన్ని ఆకర్షించటంతో ఆ పేరే ఈ ప్రాంతానికి స్థిరపడిపోయింది. కోస్తా ఆంధ్ర నాయకులు మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని వేర్పరచాలని ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుపుతున్న సమయంలో ఈ ప్రాంతం నాయకులు ఆంధ్ర ప్రాంతంతో కలిస్తే రాయలసీమ అభివృద్ధి చెందదేమో అని సంశయించి, మొదట వారికి సహకరించలేదు. రాయలసీమ ప్రజల అనుమానాలు తీర్చటానికే 1937 నవంబరు 16 లో శ్రీబాగ్ ఒడంబడిక రూపొందించబడింది.

రాయలసీమ సంస్కృతి

[మార్చు]

ప్రధాన వ్యాసం: రాయలసీమ సంస్కృతి

7తత్వము

[మార్చు]

తత్వము సంస్కృతిలో ఒక భాగం. రాయలసీమలో ఎందరో తత్వవేత్తలు జన్మించారు.

6సాహిత్యం

[మార్చు]

విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి, శ్రీ కృష్ణదేవ రాయలు హయాంలో ఈ ప్రాంతపు సంస్కృతి చాలా ఉన్నతి చెందినది. అష్టదిగ్గజాలలో ఐదు మంది (అల్లసాని పెద్దననంది తిమ్మనధూర్జటికందుకూరి రుద్రకవి (మాదయ్యగారి మల్లన), అయ్యలరాజు రామభధ్రుడు) ఈ ప్రాంతం వారే.

కడప జిల్లాకి చెందిన యోగి వేమనబ్రహ్మం గారు తమ రచనల ద్వారా సామాన్య ప్రజానీకాన్ని విద్యావంతులని చేయటానికి ఎంతో కృషి చేశారు. శ్రీమద్భాగవతముని రచించిన పోతనామాత్యుడు కూడా ఒంటిమిట్ట లోనే జన్మించాడన్న అభిప్రాయం ఉంది.

బళ్ళారి రాఘవధర్మవరం రామకృష్ణమాచార్యులుకోలాచలం శ్రీనివాసరావు వంటి రంగస్థల ప్రముఖులను అందించిన బళ్ళారి ప్రదేశానికి గొప్ప చరిత్ర గలదు. బళ్ళారి లోని రాఘవ కళా మందిర్ బళ్ళారి రాఘవ పేరు పై స్థాపించినదే.

తత్త్వవేత్త, ఆధ్యాత్మిక గురువు అయిన జిడ్డు కృష్ణమూర్తికట్టమంచి రామలింగారెడ్డి చిత్తూరుకి చెందినవారు.

చిత్తూరు జిల్లాకడప జిల్లాలకు చెందిన పలు ఉర్దూ రచయితలు ఉర్దూ సాహ్యిత్యానికి సేవ చేశారు.

5భాష

[మార్చు]

రాయలసీమలో శుద్ధమైన తెలుగు భాష మాట్లాడే సంస్క్రతి ఉంది. రాజభాష తెలుగైనా రెండవ అధికార భాషగా ఉర్దూ భాష ఉంది. చిత్తూరు జిల్లాలోని పడమట, దక్షిణ ప్రాంతాలలో తమిళ భాష మాట్లాడేవారు ఎక్కువ. తిరుపతి, చిత్తూరు, పుత్తూరు ప్రాంతాలలో తమిళ ప్రభావం ఎక్కువ. కుప్పంలో ద్రావిడ విశ్వవిద్యాలయం ఉంది. మూడు రాష్ట్రాలు, ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు కలిసే చోట ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.

4సంగీతం

[మార్చు]

బ్రాహ్మణ కులంలో కేవలం రాయలసీమ ప్రాంతానికి మాత్రం పరిమితమైన ఉపకులం ములకనాడు బ్రాహ్మణం. ఈ కులానికి చెందిన త్యాగరాజు కాకర్ల (అర్ధవీడు)కి చెందినవాడు. ప్రస్తుతం ఇది ప్రకాశం జిల్లా ఉన్ననూ ఒకానొక గానంలో ఈయన పూర్వీకులు రాయలసీమకి చెందినవారని తానే స్వయంగా చెప్పుకొన్నారు.

వాగ్గేయకారుడైన అన్నమయ్య కడప జిల్లాకి చెందిన తాళ్ళపాకకి చెందినవాడు. తరిగొండ నరసింహ స్వామి పై, వెంకటేశ్వర స్వామి పై అనేక గీతాలని రచించిన వెంగమాంబ తిరుపతి వద్దనున్న తరిగొండకి చెందినది. సంగీతకారుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ అనంతపురానికి చెందినవాడు.

సంగీతకారుడు, వైద్యుడు అయిన శ్రీపాద పినాకపాణి జన్మతః శ్రీకాకుళం జిల్లాకి చెందినవారైననూ, కర్నూలులో స్థిర పడ్డారు.

కళలు

[మార్చు]

3చలన చిత్ర రంగం

[మార్చు]

2పుణ్యక్షేత్రాలు

[మార్చు]