ఎం.సుబ్బారాయుడు
కర్నూల్ జిల్లాలోని పశ్చిమప్రాంత మండలాలు హాలహర్వి, హొళగుంద, కౌతాలం, ఆదోని, ఎమ్మిగనూర్, కోడుమూర్లు అత్యంత కరువుపీడిత ప్రాంతాలు. వీటికి తాగు, సాగు నీరందించే ఏకైక జల వనరు తుంగభద్ర దిగువ కాలువ. 24 టిఎంసిల నీరు కేటాయించబడ్డ ఈ దిగువకాలువ ఆయకట్టు లక్షా 50 వేల ఎకరాలు కాగా, దీనిపైనే 145 గ్రామాలు తాగునీటిపై ఆధారపడి ఉన్నాయి. 324కి.మీ.ల పొడువున్న ఈ కాలువలో 0 నుండి 250కి.మీ. వరకు తుంగభద్రా బోర్డ్ పర్యవేక్షణ వుంటుంది. 0నుండి 131కి.మీ. వరకు ఈ కాలువ కర్నాటక రాష్ట్రంలో ప్రవహిస్తుంది.
24 టిఎంసిల నీటి కేటాయింపు ఉన్నా ఆయకట్టుదారులు కొన్ని దశాబ్దాలుగా ఏనాడు 10 టిఎంసిలకు మించి నీటిని పొందలేదు. తుంగభద్ర డ్యాంలో పూర్తి సామర్థ్యం మేరకు నీరు చేరక పోవడం, డ్యాంలో పూడిక చేరడం, కర్నాటక ప్రాంతంలో అనధికార సాగువల్ల దిగువ కాలువ ఆయకట్టుదారులకు తీవ్ర నష్టం జరుగుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే గతేడాది కేవలం 24వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరందింది.
ఈ సందర్భంగా దిగువ కాలువ ఆయకట్టు స్థిరీకరణకైవున్న ఏకైక ప్రత్యా మ్నాయం. దీనికి ఆ ప్రాంతంలో ప్రవహించే వేదవతి నదీ జలాలను వినియోగించు కోవడమే మార్గం .
అంతరాష్ట్ర నది అయిన వేదవతి(హగరి), వేద`అవతి అనే రెండు ఏరుల కలయికతో ఏర్పడిరది. కర్నాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమలలోని బాబుబుడాన్ గిరి ప్రాంతలో మొదలైన ఈ నది కర్నాటక సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని భైరవాని తిప్ప దగ్గర ప్రవేశించి మరికొంతదూరం ప్రవహించిన తర్వాత ఆంధ్ర-కర్నాటక (బళ్లారి-అనంతపురం) సరిహద్దుగా ప్రవహిస్తుంది. ఆ తర్వాత తిరిగి కర్నాటకలో ప్రవేశించి కొన్ని మైళ్ళ ప్రవాహం తర్వాత బళ్లారి-కర్నూల్ జిల్లాల సరిహద్దుగా మారి కర్నూల్ జిల్లాలో తుంగభద్రా నదిలో కలుస్తుంది. ఈ నది కర్నాటకలో 182 మైళ్ళు, ఆంధ్రప్రదేశ్‌లో 45 మైళ్ళు, ఇరురాష్ట్రాల సరిహద్దుగా 16 మైళ్ళు… మొత్తం 243 మైళ్ళ ప్రయాణం సాగిస్తుంది.
బచావత్ కమీషన్ వేదవతిని కృష్ణ బేసిన్ కె-9 సబ్‌బేసిన్ నదిగా పరిగణిస్తుంది.
1973లో బచావత్ కమీషన్ కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్నాటక, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. కాని ఆ సమయంలో వేదవతి జలాల లభ్యతపై తగినంత పరిశోధ నాత్మక సమాచారం లేకపోవడంతో వేదవతిలో 50 టిఎంసిల జలాలు లభ్యం కావచ్చనే అంచనాతో 75% ఆధారితంగా పైరాష్ట్రాలకు పంపిణీ చేసింది. అయితే వేదవతి కేవలం కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోనే ప్రవహిస్తూంది కాబట్టి ఆనదీ జలాలను ఆ రెండు రాష్ట్రాల మధ్యనే పంపిణీ చేసింది.
కర్నాటకలోని..
వాణి విలాస్ సాగర్‌కు 5.90 టిఎంసిల ఆవిరి నష్టం
2.30 టిఎంసి G చిన్న సాగునీటి ప్రాజక్టులకు 29.87 టిఎంసిటి,
మొత్తం 38.07 టిఎంసిలను కేటాయించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని…
భైరవానితిప్ప రిజర్వాయర్‌కు 4.10టిఎంసి
ఆవిరినష్టం 0.80టిఎంసి
చిన్న తరహా నీటి పారుదలకు 7.57 టిఎంసిలు
మొత్తం సగటున సంవత్సరానికి 12.47 టిఎంసిల కేటాయింపు జరిగింది.
మొత్తం పంపిణి ` 38.07G12.47R 50.54 టిఎంసిలు
అయితే తర్వాతి కాలంలో కేంద్ర జల కమీషన్, 43 ఏళ్ళ (1965-66 నుండి 2007-08 వరకు) గణాంకాలను పరిశీలించి, 65% ఆధారితంగా 74 టిఎంసీలు లభిస్తాయని నిర్ణయించింది.
సగటున ఏడాదికి 40.66 టిఎంసిల చొప్పున వేదవతి నది జలాలను కర్నాటక రాష్ట్రం వాడుకుందని బ్రిజేష్ కుమార్ కమిటీకి నివేదిక సమర్పించింది. అంటే ఆ రాష్ట్రం ఏడాదికి సగటున ( 40.66 టిఎంసీ -38.07 టిఎంసిలు) 2.59 టిఎంసిలు అధికంగా వాడుకుందన్న మాట. ఇక మన రాష్ట్రం అదే కాలంలో సగటున సంవత్సరానికి 6.77 టిఎంసిలు వాడుకుందని తేల్చింది. అంటే మనకు కేటాయిం చింది 12.47 టిఎంసిలు కాగా, వాడుకున్నది కేవలం 6.77 టిఎం సిలు మాత్రమే. అంటే మనం వినియోగించని మన హక్కైన నీరు 12.47 టిఎంసిలు- 6.77 టిఎంసి R 5.70టిఎంసిలు. దాదాపు 6 టిఎంసిలుగా చెప్పవచ్చు.
అంతే గాక 43 సంవత్సరాలలో కర్నాటక 31 ఏళ్ళు తనకు కేటాయించిన నీటికన్న అధికంగా వాడుకోగా, మన రాష్ట్రం మనకు కేటాయించిన నీటికన్న అధికంగా కేవలం 3 ఏళ్ళు మాత్రమేనని కేంద్ర జల కమీషన్ సమర్పించిన జలనివేదిక స్పష్టం చేసింది. అంటే మన ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్ల కేటాయించిన నీటిని వినియోగించుకోక పోవడంతో నష్టపోయింది, పోతున్నది కరువుపీడిత రాయలసీమ ప్రాంతమే కావడం యాదృచ్ఛికం కాదని చెప్పవచ్చు. అలా మనం వినియోగించుకోని నీరంతా తుంగభద్ర ద్వారా కృష్ణలో చేరి సాగర్, కృష్ణ`డెల్టాలను సంపన్నం చేసి ఆ ప్రాంతపు రొయ్యలు, చేపల చెరువులను నింపి ఆ తర్వాత సముద్రం పాలవుతున్నాయనేది చరిత్ర చెబుతున్న సత్యం.
అదలా వుంటే ఇప్పుడు వేదవతి నదీజలాల గురించి తెలుసు కుందాం… వేదవతి, కృష్ణా నదిలాగే పశ్చిమ కనుమ అధిక వర్షపాతంపై ఆధారపడుతుంది. వేదవతి నది పొడవు కర్నాటకలో 182 మైళ్ళు కాగా, యిక దానికి నీరు అందించే పరీవాహక ప్రాంతం కర్ణాటకలో 7034 చదరపు మైళ్ళు.
వేదవతి నది పొడవు ఆంధ్రప్రదేశ్‌లో 45 మైళ్ళు. దానికి నీరు అందించే పరీవాహక ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో 2074 చదరపు మైళ్ళు. వేదవతి నది పొడవు, పరీవాహక ప్రాంతం కర్నాటకలో ఎక్కువగా వుండటంతో, ఆ నదీ జలాలను కర్నాటక వాసులే ఎక్కువగా వినియోగించుకొనే అవకాశం కల్గింది. అందువల్లనే వేదవతి కర్నాటక సరిహద్దు దాటి భైరవానితిప్ప చేరుకొనేసరికి నదిలో నీరు వుండటం లేదు. మన రాష్ట్రంలో వేదవతి జలాలను నిల్వ వుంచుకోనేందుకు వున్నా ఏకైక జలాశయం భైరవానితిప్ప. అందులో దశాబ్దాలుగా కనీసం 1 టిఎంసి నీరు కూడా చేరడం లేదు.
పోతే ఆంధ్రప్రదేశ్‌లో వేదవతి పరీవాహక ప్రాంతం 2074 చదరపు మైళ్ళు ఉన్నా, మనం వేదవతి జలాలను వినియోగించుకోలేక పోతున్నాం. అంతేగాక అనంతపురం జిల్లాలోని వేదవతి పరీవాహక ప్రాంతంలో పడే కొద్దిపాటినీటిని కూడా మనం అనంతపురం జిల్లాలో వినియోగించుకునే వీలులేదని బచావత్ కమీషన్ ఆంక్షలు విధించింది. కాని భైరవానితిప్ప క్రింది భాగాన కర్నూల్ జిల్లాలో లభించే వేదవతి జలాలను మనం వాడుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలులేవు. వాటిని వినియోగించు కునేందుకు ఇక్కడ ఎలాంటి పథకాలులేక ఆ నీరంతా తుంగభద్ర ద్వారా క్రిష్ణార్పణ మవుతోంది.
అందువల్ల వేదవతిలో లభ్యమయ్యే జలాలను కరువుపీడిత పశ్చిమ మండలాలకు లబ్దిచేకూరేలా తుంగభద్ర దిగువకాలువ ఆయకట్టు స్థిరీకరణకై తగిన సాగునీటి పథకాలు అత్యవసరం వాటిని చేపట్టాల్సిన బాధ్యత ఈప్రభుత్వానికుందని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ పథకమేమో వివరంగా చూద్దాం
కర్నూల్ జిల్లాలో వేదవతి, దాని ప్రవాహ నిడివిలో 131కి.మీ. వద్ద ప్రవేశించి, ఆతర్వాత మరల కొంతదూరం కర్ణాటకలో ప్రవహించి తిరిగి 156 కి.మీ.ల వద్ద మనరాష్ట్రంలో ప్రవేశిస్తుంది. 156కి.మీ.ల వద్ద తుంగభద్ర దిగువకాలువ కట్ట ఉపరితలఎత్తు సుమారు 405మీ.
గూళ్యంవద్ద వేదవతినది అడుగుభాగపు స్థాయి 385మీ.
ఎత్తులో తేడా 20 మీ.
వేదవతి(గూళ్యం) నుండి దిగువకాలువ దూరం.4.కి.మీ.
అందువల్ల గూళ్యంవద్ద వేదవతినదిపై 20 మీ.ఎత్తుకు ఒక ఎత్తిపోతల పథకం ఏర్పాటుచేసి 4.కి.మీ.ల పైపులైను ద్వారా వేదవతి జలాలను దిగువ కాలువకు తరలించవచ్చు.
కర్నూల్ జిల్లాలో దిగువకాలువ నీటివిడుదల సామర్థ్యం 725 క్యూసెక్కులు. కనుక 350 క్యూసెక్కుల సామర్థ్యంగల రెండు లిఫ్టులను ఏర్పాటు చేయవలసి వుంటుంది. ముందస్తు జాగ్రత్తకై 350 క్యూసెక్కుల సామర్థ్యంగల మరో పంపును ఏర్పాటు చేయాలి.
ఆ విధంగా రోజుకు 0.060 టిఎంసిలను దిగువ కాలువకు తోడి పోయగలం. వేదవతిలో జూన్ నుండి నవంబర్ వరకు నీరు లభ్యమవుతుంది కాబట్టి 100 రోజులలో 6 టిఎంసిల నీటిని దిగువ కాలువకు వాడుకోవచ్చని పరిశీలనలో తేలింది. ఈ పథకంవల్ల కర్నాటక ప్రాంత రైతులకూ మేలు జరుగుతుంది. కాబట్టి ఆరాష్ట్రం నుండి ఎలాంటి అభ్యంతరం ఉండదు. బచావత్ కమీషన్ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టిఎంసిల నీటిని, విభజనానంతరం, కృష్ణా నదీ నిర్వహణ బోర్డ్డు ఆంధ్రప్రదేశ్‌కు 512 టిఎంసిలు, తెలంగాణాకు 299 టిఎంసిలుగా పంచింది. అంతేగాక, ఇరు రాష్ట్రాలు తమకు కేటాయించిన నీటిని తమకు తోచిన రీతిలో వినియోగించుకోవచ్చని తెలియజేసింది. అందువల్ల మనకు కేటాయించబడీ, మనము వినియోగించుకోలేని 6 టిఎంసిల నీటిని అదే కె`9 బేసిన్‌లో వినియోగించు కునేందుకు ఎలాంటి అభ్యంతరాలుండవు. అంతేగాక, ఆ 6 టిఎంసిల నీరు మనకు కేటాయించిన 512 టిఎంసిలలో భాగం కాబట్టీ క్రిష్ణాబోర్డ్, కర్నాటక ప్రభుత్వ అను మతులు కోరనవసరంలేదు. కాని, 0 కి.మీ నుండి 250 కి.మీ వరకు దిగువ కాలువ తుంగభద్రా బోర్డు పరిధిలో వుండటంవల్ల ఈ విషయాన్ని ఆబోర్డుకు తెల్పితేచాలు.
సాధారణంగా తుంగభద్ర డ్యాం నుండి దిగువకాలువకు నీటి విడుదల ఏటా జూలై/ఆగస్ట్ నెలలలో వుంటుంది. యిక వేదవతి నదిలో నీటి ప్రవాహం జూన్ నెల మొదటి పక్షంలోనే ప్రారంభమవుతుంది. అందువల్ల కృష్ణా`డెల్టాకు నాట్లు వేయడానికి పట్టిసీమ ద్వారా జూన్‌లోనే నీటిని ఎలా సరఫరా చేస్తున్నారో, అదేవిధంగా వేదవతి జలాలను జూన్ ప్రారంభంలోనే తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టుకు అందించవచ్చు. ఆపైన దిగువకాలువ ఆయకట్టుకు కేటాయించిన నీటిని అవసరం మేరకు ఇండెంట్ పెట్టి వాడుకోవచ్చు. సరైన పర్యవేక్ష ణలో దిగువకాలువ ఆయకట్టుకు వేదవతి, తుంగభద్ర నదుల నుంచి జలాలను అవసరమైన సమయంలో అవసరమైన మేరకు అందించవచ్చు. ఆవిధంగా దిగువకాలువ ఆయకట్టుదారుల ప్రయోజనాలను కాపాడగలం. ఈ నీటి పథకానికి ఖర్చు సుమారు
1) 3 ఎత్తిపోతల పంపులు,
1కి రూ.35 కోట్లు చొప్పున రూ.105 కోట్లు
2) భూసేఖరణ, పైప్‌లైన్లు, ఇతరములు రూ.20 కోట్లు
మొత్తం రూ.125 కోట్లు
దీనివల్ల ప్రజలకు, ప్రభుత్వానికి జరిగే లబ్ది చాలా ఎక్కువ. ఒక అంచనా ప్రకారం 1 టిఎంసి నీటి సరఫరా వల్ల చేకూరే లాభం సంవత్సరానికి రూ.35 కోట్లు అంటే 6 టిఎంసిల నీటి సరఫరాతో రూ.210 కోట్ల మేర ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది.
జలశాస్త్ర నివేదిక ప్రకారం కె-9 బేసిన్‌లో వేదవతిలో నీటి లభ్యత 74.05టిఎంసిలు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లకు బచావత్ కేటాయింపులు `50.54 టిఎంసిలు. (38.07G12.47R50.54 టిఎంసీ) ఈ కేటాయింపులు పోను వేదవతిలో లభ్యమయ్యే అదనపు నికర జలాలు ` 74.05 టిఎంసీలుÑ 50.54 టిఎంసిR 23.51 టిఎంసిలు.
అంతేగాక బచావత్ మరియు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేదవతిలో సమృద్దిగా నీరుందని స్పష్టం చేశాయి కూడా. అందువల్ల పైన చూపిన కేటాయించబడని 23.51 టిఎంసిలను ఆంధ్రప్రదేశ్ వినియోగించుకునే అవకాశం నూటికి నూరు పాళ్ళు వుందని చెప్పవచ్చు. అయితే ఈ పథకాల విషయంలో మనం రెండు విషయాలను అర్థం చేసుకోవాలి.
1) గూళ్యం దగ్గర 20 మీ.ఎత్తిపోతల పథకం ద్వారా దిగువ కాలువ ఆయకట్టు స్థిరీకరణకు వినియోగించే 6 టిఎంసిల జలాలు ఇప్పటికే మన రాష్ట్రానికి కేటాయించ బడి, వినియోగించుకోని జలాలు. వాటికి కొత్తగా కేటాయింపులు అవసరం లేదు.
2) డిసెంబర్ 2011లో వేదవతి నదీ జలాల వినియోగంకై మరో ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించారు. అది 3,500 క్యూసెక్కులను రెండు ప్రదేశాలలో 40 మీటర్ల ఎత్తిపోతల పథకం. ఈ పథకానికి పైన చెప్పబడ్డ 23.50 టిఎంసిల నీటిని వినియోగించాలి. దీనివల్ల దిగువ కాలువ పైబాగాన యింతవరకు నీరందని దాదాపు ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఆయితే ఈ జలాలకై కేటాయిం పులు అవసరం. పైరెండు పథకాలకు ఒకదానితో మరోకటికి సంబందం లేదని అర్థం చేసుకోవాలి.
ఈ రెండో పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి:`
బచావత్ కమిటీ తన నివేదికలో, రాష్ట్రాలు కొత్త పథకాలను చేపట్టే ముందు. నీటి లభ్యత గురించి పూర్తిగా పరిశోధన చేయాలని ఆ ప్రాజెక్టు వివరమైన నివేదిక తయారు చేయాలని, దాన్నిపూర్తిగా పరిశీలించిన తర్వాతనే కొత్త నిర్మాణాలను చేపట్టాలని నిర్దేశించింది. (పేజీ42 బచావత్ కమిటీ నివేదిక)
అయితే బ్రిజేష్ కుమార్ తన నివేదిక పేజీ 185లో కరువు పీడిత ప్రాంతాలకు జలాలను అందించడానికి నీటి లభ్యతను బట్టి గతంలో అవకాశంలేని కొత్త ప్రాజెక్టుల అవసరం కలుగవచ్చని తెల్పింది. అంతేగాక తన నివేదిక (పేజీ 596)లో ఆంక్షలు, సడలింపు లపై తన నిర్ణయాలను తెల్పుతూ ‘‘వాస్తవంలో మరిన్ని జలాలు అందుబాటులో వుంటే (కొత్త ప్రాజెక్టుల) ఆంక్షల సడలించవచ్చు. ఆంక్షల పరిమితులను మార్చవచ్చు. ఆంక్షలు అవసరం లేకపోతే పూర్తిగా తొలగించవచ్చు. గతంలో చెప్పినట్టు అవన్నీ నిర్దిష్టమైన వాస్తవాలపై, పరిమితులపై ఆధార పడివుంటాయి.’’ అని అన్నారు.
పై వాఖ్యానాల ఆధారంగా 15 ఏప్రిల్ 2013న కర్నూల్ జిల్లా చీఫ్ ఇంజనీర్ గారు మన ప్రభుత్వానికి ఒక వివరమైన ప్రతిపాదనను సమర్పించారు. ప్రాజెక్టు వివరమైన నివేదిక (డిపిఆర్) కోసం రూ.4.10 కోట్లు మంజూరు చేయమని కోరారు. కాని 4ఏళ్ళు గడిచినా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందనలేదు. ఇది రాయలసీమ ప్రజల అవసరాల పట్ల ప్రభుత్వానికున్న చిన్నచూపును తెలియజేస్తూంది.
ఈ ప్రాజెక్టు వల్ల భైరవాని తిప్పకు నీటి సరఫరా అయ్యే ఖర్చును తగ్గించవచ్చు. భైరవానితిప్పకు కృష్ణా జలాలను హంద్రీ-నీవా ద్వారా 254 మీటర్ల ఎత్తునుండి భైరవానితిప్పకు ఎత్తిపోయాలని ప్రభుత్వ ప్రతిపాదనలు వున్నాయి. కానీ, వేదవతి జలాలను భైరవానితిప్పకు 385 మీటర్ల నుండి ఎత్తిపోయవచ్చు. అంటే వేదవతి నుండి ఎత్తి పోయడం ద్వారా 131 మీటర్ల (385-254 మీటర్లు) తక్కువ ఎత్తు నుండే భైరవానితిప్పకు నీటి సరఫరా చేయవచ్చు. ఆ విధంగా ఎత్తిపోతల కయ్యే విద్యుత్ ఖర్చును తగ్గించవచ్చు.
అంతేగాకా హంద్రీ-నీవా కాలువను వెడల్పు చేయడంద్వారా దానికి కేటాయించిన 40 టిఎంసిల నీటిని పూర్తిగా వినియోగించు కోవచ్చని, కాలువ వెడల్పు కార్యక్రమాన్ని ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో చేపడుతూ వున్నది. ఆ కాలువకు కేటాయించిన 40 టిఎంసిలలో తాగునీటికి 05 టిఎంసిలు కేటాయించ బడ్డాయి. పోతే కాలువులో నీరు 600 కి.మీ.ల దూరం ప్రవహించవలసివుంది. కాలువలో లైనింగ్ లేకపోవడంతో ప్రవాహ నష్టాలు 20% ఉండవచ్చని అంచనా. అంతేగాక అత్యధిక ఉష్ణోగ్రత వుండే ప్రాంతాలలో హంద్రీ-నీవా ప్రవహిస్తుంది కాబట్టి ఆవిరి నష్టం కనీసం 10 టిఎంసిలు ఉంటుందని అంచనా. అంటే` హంద్రీ-నీవాలో సాగునీటికి మిగిలేది 40-05-10R25 టిఎంసిలు మాత్రమే. ఈ 25 టిఎంసిలతో సీమ నాలుగు జిల్లాలలో 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం అసాధ్యం. అంతేగాక కృష్ణా వరదజలాల నుండి హంద్రీ-నీవాకు 40 టిఎంసిలు ప్రతి ఏటా అందుతాయని చెప్పలేం కూడా.
హంద్రీ-నీవా జలాలు నీరందించే ప్రాంతాలు అత్యంత కరువు పీడిత ప్రాంతాలనే విషయం గమనంలోకి తీసుకుంటే, ఆ ప్రాంత రైతాంగానికి 40 టిఎంసిల నీటికన్నా ఎక్కువనీరు అవసరం అనేది వేరే చెప్పాల్సిన విషయంకాదు. పైన తెల్పినట్టుగా కేవలం 25 టిఎంసిలతో సీమ నాలుగుజిల్లాలలో 6.025 లక్షల ఎకరాలకు నీరందిస్తామనడం సీమవాసులను మభ్యపెట్టడమే. ఎండమావులలో దప్పిక తీర్చుకోమని చెప్పడమే అవుతుంది. ఆ 25 టిఎంసిల నీరు కేవలం కర్నూల్, అనంతపూర్ జిల్లాల అవసరాలకే సరిపోయే పరిస్థితి. అలాంటప్పుడు కడప, చిత్తూర్ జిల్లాల మాటేమీటి? ఇది సీమ జిల్లాల మధ్య వైషమ్యాలు పెంచేందుకు దోహదపడుతుందని చెప్పక తప్పదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు, దిగువకాలువ ఆయకట్టు స్థిరీకరణకు తోడ్పడే ఏకైక జలవనరు వేదవతి ఎత్తిపోతల పథకం.
ఈ పథకం గురించి మరిన్ని వివరాలకెళదాం:
బచావత్ కమిటీ ముందు వేదవతీ జలాల వినియోగం విషయంలో కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈ కింది షరతులకు అంగీకరించాయి.
1) కర్నాటకలోని వాణివిలాస్ సాగర్ నుండి అనంతపురం జిల్లాలోని భైరవానితిప్ప జలాశయం వరకు దాదాపు 40 మైళ్ళ ప్రాంతంలో కర్నాటక ఎలాంటి సాగునీటి పథకాలు చేపట్టరాదు.
2) వేదవతీకి నీరందించే ప్రధాన ఉపనది చిన్న హగరి. ఆ చిన్నహగరిపై కర్నాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల పై భాగాన 16 మైళ్ళ వరకు కర్నాటక ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. ఈ నిబంధనల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు లబ్ది చేకూరుతుంది. మరోవైపు
3) మన రాష్ట్ర (ఆంధ్రప్రదేశ్) – కర్నాటక సరిహద్దులో అనగా అనంతపురం జిల్లాలో వేదవతీపై ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు.
4) చిన్నహగరిపై ఆంధ్రప్రదేశ్ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు.
మొదట చెప్పినట్టుగా వేదవతి, అనంతపురం-బళ్లారి సరిహద్దు తర్వాత, బళ్ళారి జిల్లాలో ప్రవేశించి, కొంత దూరం తర్వాత కర్నూల్ జిల్లా-బళ్లారి జిల్లాల సరిహద్దుగా ప్రవహిస్తూంది. ఈ సరిహద్దు ప్రాంతంలో వేదవతిపై సాగునీటి పథకాల నిర్మాణాలపై ఎలాంటి అభ్యంతరాలను బచావత్ కమీషన్ పెట్టలేదు.ఈ ప్రాంతలోనే రెండు ఎత్తిపోతల పథకాలు మరియు 20 మీటర్ల ఎత్తిపోతల పథకాలను ప్రతిపాదించడం జరిగింది. ఇన్ని అవకాశాలున్నా కూడా మన ప్రభుత్వాలు సీమప్రాంత నీటి అవసరాలను తీర్చేందుకు ఏమాత్రం కృషి చేయకపోవడం విచారకరం. ఈ విషయాన్ని బ్రిజేష్‌కుమార్ నివేదిక స్పష్టంచేసింది కూడా. ‘‘ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టుకు ఎలాంటి నూతన ప్రతిపాదనలు చేయలేదు.’’ (పే 540)
పోగా పోలవరం నిర్మాణంవల్ల రాయలసీమ సస్యశ్యామలమైతుం దని అన్ని పార్టీలు ఊదరగొడ్తున్నాయి. కాని వాస్తవాలు అందుకు పూర్తిగా విరుద్దంగా వున్నాయి. 80 టిఎంసిల గోదావరి జలాలను పోలవరం పథకం ద్వారా కృష్ణాకు తరలించడంవల్ల మన రాష్ట్ర వాట 22.5 టిఎంసిలు (80-మహారాష్ట్ర 14- కర్నాటక 21-తెలంగాణా 22.5) మాత్రమే. పోగా పైరాష్ట్రాలు దాదాపు 57.50టిఎంసిల కృష్ణా జలాలను వినియోగించుకుంటాయి. దీనివల్ల శ్రీశైలం జలాశయంకు చేరే నీరు ఆ మేరకు 57.50 టిఎంసిల తగ్గుతాయి. దాంతో, కృష్ణా వరద జలాలపై ఆధారపడే సీమ ప్రాజెక్టులు హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ పథకాలకు నీరందడం కష్టసాధ్యం అవుతుంది. రాయలసీమ ప్రజలకు మబ్బుల్లో(పోలవరం) నీళ్ళను చూపించి ముంత లోని(వేదవతి) నీళ్ళను పారవేసేలా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపట్ల సీమప్రజలు అప్రమత్తంగా వుండాలి. వేదవతిలో నికరంగా లభ్యమవు తున్న 23.50 టిఎంసిల నీటిని వినియోగించుకోవడంద్వారా ఇటు తుంగభద్ర దిగువకాలువ ఆయకట్టు స్థిరీకరణ,అటు హంద్రీ-నీవా ఆయకట్టుకు చాలా మేరకు స్థిరీకరణ చేయవచ్చు.
ఇక్కడే మరోవిషయం, కర్నాటక తమ అవసరాల నిమిత్తం 3 టిఎంసిల వేదవతీ జలాలను తమకు కేటాయించాలని బచావత్ మరియు బ్రిజేష్ కుమార్ కమిటీలను కోరగా, ఆ అభ్యర్థనను రెండు కమిటీలు తిరస్కరించాయి. యిప్పుడు మనం వేదవతీ నుండి కర్నాటకకు ఆ 3 టిఎంసిల నీరునిస్తామంటే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కర్నాటక అభ్యంతరం చెప్పే అవకాశమే ఉండదు.
పైన ప్రతిపాదించిన రెండు సాగునీటి పథకాల వల్ల వేదవతీ జలాల వినియోగంతో
1) కర్నూల్ జిల్లాలోని కరువు పీడిత పశ్చిమ మండలాలను కోన సీమగా మార్చవచ్చు.
2) హంద్రీ-నీవాకు వేదవతీ జలాల తరలించడం ద్వారా సీమ నాలుగుజిల్లాలు లబ్ది పొందుతాయి.
3) భైరవాని తిప్పకు వేదవతీ జలాల తరలించడం ద్వారా విద్యుత్ ఖర్చు తగ్గించవచ్చు.
4) గూళ్యం దగ్గర వేదవతిపై రిజర్వాయర్ లేదా బ్రిడ్జి నిర్మాణం ద్వారా ఆదోని-బళ్ళారిల మధ్య దూరం 30-35కి.మీ. తగ్గుతుంది. అందువల్ల సీమ ప్రజలు తమప్రాంత ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తెచ్చి వేదవతి ఎత్తిపోత పతకాలను సాధించుకోవాల్సిన అవసరంవుంది.